ఇదిగో ఇది నా కల
చేతల ద్వారా చదువు
సమాజంతో మమేకం కావడం ద్వారా విద్య
చిన్నప్పుడు నాకు ఇలానే అనిపించేది
తిట్లు, దెబ్బలు, కసురుకోవడాలు లేని తరగతి గదులు
మా చేతులకు, మా మెదడుకు చలనాత్మక నేర్పగల చదువు
మా కాళ్ళకు గెంతులు, నోటికి మాట్లాడే స్వేచ్చ ఇవ్వగల విద్య
ఒత్తిడి తెలియనివ్వని కృత్యాలు
భారం అనిపించని భవిష్యత్తును మాకు మేమే నిర్మించుకునే అవకాశం కల్పించే వీలు
ఒకరు నేర్చుకున్నది ఒకరు పంచుకునే సౌకర్యం
ఆటల్లాంటి పాఠాలు
పాటల్లాంటి పాఠాలు
చిత్రాల ద్వారా మాలోకి చేరే చదువు
ఆటల సాంగత్యంలోనే విప్పారే మేధస్సు
ఎన్ని కలలో అప్పుడు
ఇప్పుడు ఆ కలలను నిజం చేసేందుకు ఏవో పిచ్చి ప్రయత్నాలు
ఇదిగో...
ఇదే నా కల....
తోటలోని పక్షులు తమకు నచ్చిన పని చేసినట్టు
తమకు నచ్చిన రాగం తీసినట్టు
తరగతి గది తోట కావాలని....
ఇదో...
ఇలా పిల్లలు స్వీయ అభ్యాసం విలువ తెలుసుకోవాలని...
నేటి, రేపటి ప్రపంచ భవిష్యత్తును నిర్మించగల నేర్పరులు కావాలని....
పిల్లలకు, పిల్లల మనసెరిగిన పెద్దలకు పిల్లల పండుగ శుభాకాంక్షలు!!