కిరణజన్యసంయోగక్రియ-అన్ని పాఠ్యాంశాలతో అనుసంధానం చేయుట:
ఇది పిల్లలందరికీ బాగా అవసరమైన అంశం. ఈ
పాఠ్యాంశాన్ని బోధించినపుడు జీవశాస్త్రమే కాక, సామాజిక శాస్త్రం, గణితం, భాష కూడా నేర్పుతాము. మనం
తయారుచేసే అభ్యాసాలు/కృత్యాల వల్ల ఈ పద్ధతి సులువుగా మారుతుంది.
ప్రయోగం: మొక్కల పెంపకం. రోజు వారీ
నమోదు. మొక్క విత్తన దశ నుండి పండు దశ వరకూ పరిశీలింపజేయుట. వివరాలు నమోదు
చేయించుట.
సమాచార సేకరణ: మీ పరిసరాల్లో ఉన్న చెట్ల
పేర్లు రాసి, వాటి సంఖ్యను రాయండి.
కిరణజన్యసంయోగక్రియ కారకాలు- ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, నీరు, సూర్యకాంతి.
ఫిజిక్స్- నీరు చలనం-వేళ్ళ నుండి ఆకు
వరకూ జరిగే విధానం చెప్పాలి. (ఆవ మొక్క ప్రయోగం చేయించవచ్చు. ఒక పరీక్షనాళికలో ఆవ
మొక్కను ఉంచి నీరు పోసి, ఆ నీటికి ఎరుపు రంగు కలపాలి. కొంతసేపటికి మొక్క కాండం గుండా ఎరుపు నీరు పైకి
పోవడం చూడవచ్చు.)
కెమిస్ట్రీ-ఆక్సిజన్ మరియు కార్బన్ డై ఆక్సైడ్ గురించి తెలియజెయ్యాలి.
మొక్కల్లో జరిగే రసాయన చర్యల గురించి కొద్దిగా చెప్పొచ్చు.
జీవశాస్త్రం- మొక్కల్లో ఆహార తయారీ
గురించి చెప్పి, వివిధ మొక్కలను పరిశీలించి నివేదిక ఇవ్వమని చెప్పాలి. అలాగే ఈ మొక్కలపై
ఆధారపడే జీవుల జాబితా, ఎందుకోసం ఆధారపడుతున్నాయో కారణాల జాబితా తయారుచేయించాలి.
సోషల్-వృక్షాలు- అడవులు వాటి ప్రాముఖ్యత- అడవులపై
ఆధారపడే వారి గురించి చెప్పొచ్చు.
గణితం- నువ్వు పెంచిన మామిడి చెట్టు సంవత్సరానికి మూడు వందల
కాయలు కాస్తే, నాలుగేళ్ళకు ఎన్ని కాయలు కాస్తుంది?
భాష- కొంచెం ఆసక్తికరంగా ఉండేలా ఒక ఐదు మొక్కల పేర్లు
మూడు భాషల్లో రాయమని చెప్పవచ్చు. మొక్కల పెంపకం గూర్చి వారి అనుభవాలు కథగా
రాయించవచ్చు. అలాగే వారు పెంచిన మొక్కలో గమనించిన కిరణజన్యసంయోగక్రియ ప్రక్రియను వారి
సొంత మాటల్లో చెప్పించుట.
పటనైపుణ్యం- మొక్కల చిత్రాలు వేయించుట. పర్యావరణలో
మొక్కల ప్రాముఖ్యత గురించి చిత్రాలు వేయించుట.
కోడి గుడ్లతో ప్రయోగాలు
కోడి గుడ్లతో రకరకాల ప్రయోగాలు చేయిస్తాం. ఇవి
చేయడానికి పిల్లలు బాగా ఇష్టపడ్తారు. వీటితో ఏ పాఠ్యాంశాలను అనుసంధానించొచ్చు?
నీరు, నూనె, రంగులు:
ఇదొక మంచి ప్రయోగం కదా! నీరు, నూనె, ఒకటి, రెండు రంగులను కలిపి ఒక
సీసాలో పోసినట్లైతే పిల్లలకు భలే ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ ఏ ఏ పాఠ్యాంశాలను
అనుసంధానం చేసి బోధించవచ్చో మీరే ఆలోచించండి.
నీటిలో మునిగేవి, తేలేవి
ఇలాంటి ప్రయోగాలతో వివిధ కృత్యాలు చేయించవచ్చు.
గుడ్లగూబ
గుడ్లగూబ గురించి చెప్పేటపుడు అది నిశాచరి అని
చెబుతాం. కళ్ళు పనిచేయవు కనుక చెవులతో ఇన్ఫ్రా రెడ్ కిరణాలను ఎలా వినియోగించుకుంటుందో
తెలియజేయాలి. దాని ఆహారపు అలవాట్లు చెప్పాలి. పర్యావరణ సమతుల్యతకు ఈ జీవి
ఆవశ్యకతను చెప్పాలి. (పోయిన సంవత్సరం నాల్గవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్న
కథను చెప్పవచ్చు లేదా నాటిక వేయించవచ్చు)
సీక్రెట్ లేఖలో నాలుగు సైన్స్ అంశాలు:
ఒక నిమ్మకాయను తెమ్మనాలి. దాని రసం తియ్యించి, ఆ రసంలో పుల్లను ముంచి, ఒక తెల్లకాగితంపై ఉత్తరం
రాయించాలి. ఆరిన తర్వాత ఆ కాగితంపై ఏమీ కనిపించదు. కానీ కొవ్వొత్తి వెలిగించి, దాని ఎదురుగా పెట్టినట్లైతే
మనం రాసినది చదవచ్చు. ఈ ప్రయోగంలో నేర్పడానికి కెమిస్ట్రీ, జీవశాస్త్రం, చరిత్ర కూడా ఉంది కదా!
అలాగే, సూర్యుడు, గ్రహాలు, గ్రహణాలు, ఉప్పునీరు ప్రయోగాలు, నీటి కాలుష్యం, మొక్కల పెంపకం, అంకురోత్పత్తి, వాతావరణం, మేఘాలు మొదలైన ఎన్నో అంశాలను కొరిలేట్ చేస్తూ చెప్పొచ్చు. కాదేదీ కవితకనర్హం
అన్నట్లుగా పిల్లలు ఆడుకునే గవ్వల దగ్గరనుండి మందారపు పువ్వుతో తయారుచేసే లిట్మస్
పేపర్ తయారీ వరకూ అన్నింటినీ అనుసంధానం చేస్తూ చెప్పవచ్చు.